Minister Tummala | కీర్తీ ప్రతిష్టల కోసం ప్రాకులాడే వాడిని కాదు: మంత్రి తుమ్మల

సీతారామా ప్రాజెక్టు విషయంలో క్రెడిట్ కోసం తాను ప్రయత్నిస్తున్నాని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు తనపై చేసిన వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు

Minister Tummala | కీర్తీ ప్రతిష్టల కోసం ప్రాకులాడే వాడిని కాదు: మంత్రి తుమ్మల

జిల్లాకు గోదావరి జలాలు అందించాలన్నదే జీవితాశయం
హరీశ్‌రావు వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్‌

విధాత, హైదరాబాద్ : సీతారామా ప్రాజెక్టు విషయంలో క్రెడిట్ కోసం తాను ప్రయత్నిస్తున్నాని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు తనపై చేసిన వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. మంళవారం మీడియాతో మాట్లాడిన తుమ్మల హరీశ్‌రావు వ్యాఖ్యలను ఖండించారు. తాను క్రెడిట్ కోసం తాపత్రయ పడే వ్యక్తి కాదని, కీర్తి, ప్రతిష్టల కోసం ఆరాటపడే మనిషిని కాదని.. ఖమ్మం జిల్లా ప్రజలకు గోదావరి జలాలు అందించాలన్నదే తన జీవితాశయమని స్పష్టం చేశారు. ప్రజలకు చేసిన మంచి ఫ్లెక్సీల్లో కాదు.. పనుల్లో కనపడాలని తుమ్మల అన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీరాముడు, ఖమ్మం జిల్లా ప్రజల దయతోనే తాను ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు, ఎన్టీఆర్ కాలం నుంచి మంత్రిగా ఉంటూ జిల్లాకు మేలు చేసేందుకే ప్రయత్నించానని అన్నారు.

ఖమ్మం జిల్లా నుంచే గోదావరి పారుతున్నా.. ఆ జలాలు ఈ నేలను తడుపలేదన్నారు. మొదటి నంచి జిల్లాలో మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలన్నదే తన సంకల్పమని పేర్కొన్నారు. మంత్రిగా ఉన్న ప్రతిసారి ముఖ్యమంత్రులతో మాట్లాడి తన ప్రయత్నాలు తాను చేశానని గుర్తు చేశారు. సత్తుపల్లి, జూలూరుపాడు, వేలేరు ప్రాంతాలకు కూడా నీళ్లు ఇవ్వాలంటూ ప్రాదేయపడిన సంఘటన కూడా ఉన్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లా రైతాంగాన్ని దృష్టిలో పెటుకుని నీళ్ల కోసం గతంలో బీఆరెస్ పార్టీలో చేరానని, కానీ గత ప్రభుత్వం జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్టుల పనులను పట్టించుకోలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ కోరిక మేరకు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరానని గుర్తు చేశారు. కాంగ్రెస్ లోకి వచ్చేటప్పుడు కూడా ప్రాజెక్టులు పూర్తి చేయాలంటూ అధిష్టానానికి స్పష్టం చేశానని, అనంతరం మంత్రి కాగానే సత్తుపల్లి టన్నెల్ పనులు ప్రారంభించానని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడంతో గోదావరి జలాలను అందించాలన్న తన జీవితాశయం నెరవేరబోతుందన్నారు.