• Telugu News
  • /Telangana

రేపు నేను ఓడిపోతా ..మా గవర్నమెంట్ పోతది: మంత్రి వివేక్ !

పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్లపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రేపు నేను ఓడిపోతా.. మా గవర్నమెంట్ పోతది” అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 21, 2026, 5:09 pm IST
Read Time: 4 mins
రేపు నేను ఓడిపోతా ..మా గవర్నమెంట్ పోతది: మంత్రి వివేక్ !

పాలిటెక్నిక్ విద్యార్ధుల డిమాండ్లపై స్పందిస్తూ తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. స్కిల్ వర్సిటీ నుంచి ఇన్వెస్టర్లు బ్యాక్ అవుట్ అవ్వరని గ్యారెంటీ ఇవ్వండని పాలిటెక్నిక్ విద్యార్ధులు మంత్రి వివేక్ ను డిమాండ్ చేశారు. దీనికి మంత్రి వివేక్ బదులిస్తూ..ఇప్పుడు మంత్రిగా నేను ఉన్నా…రేపు నేను ఓడిపోతా ..మా గవర్నమెంట్ పోతది..నా గ్యారెంటీ తో మీకేం ఫాయిదా? అంటూ వ్యాఖ్యానించారు.

దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మంత్రి వివేక్ వ్యాఖ్యలను ప్రతిపక్ష సోషల్ మీడియా వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తుంది. ఇప్పటికే 22ఏ నిషేధిత భూ వివాదం, పార్టీలో అసమ్మతి, అంతర్గత సమస్యలు..మంత్రి కొండా కుటుంబం తిరుగుబాటు వంటి సమస్యలతో సతమతమవుతున్న సీఎం రేవంత్ ప్రభుత్వానికి మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలు సంకంటగా మారాయి.

అంతకుముందు మంత్రి వివేక్ మాట్లాడుతూ..పాలిటెక్నిక్ విద్యార్థులకు రెండో సంవత్సరం పరీక్షల విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి అని భరోసానిచ్చారు. పాలిటెక్నిక్ పూర్తి చేసి అర్హత సాధించిన విద్యార్థులకు ప్రస్తుతం ఉన్నట్టుగానే లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా చేరే అవకాశం కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థుల అవకాశాలను తగ్గించడం కాదు..వారి భవిష్యత్‌కు మరిన్ని అవకాశాలు కల్పించడమే మా శక్తి స్కీమ్ లక్ష్యం అన్నారు. పరీక్షలు కొనసాగుతాయి..లేటరల్ ఎంట్రీ కొనసాగుతుంది..ఇంజినీరింగ్‌లో రెండో సంవత్సరం అవకాశం కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.