MLA Battula Lakshmareddy| రైతులకు యూరియా కోసం.. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల రూ.2కోట్ల సాయం!
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన నియోజవర్గం రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత పరిష్కారం కోసం రూ.2కోట్ల రూపాయాలను ప్రభుత్వానికి సహాయంగా అందించారు. సంబంధిత చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. తన మిర్యాలగూడ నియోజకవర్గంలోని రైతులకు ఒక్కో బస్తా యూరియా అందించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డిని బత్తుల కోరారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన కుమారుడి రిసెప్షన్ ను రద్దు చేసుకుని..అందుకు అయ్యే ఖర్చును రైతులకు యూరియా అందించేందుకు సహాయంగా ఇస్తున్నట్లుగా తెలిపారు.
విధాత, హైదరాబాద్ : తన నియోజకవర్గంలోని రైతులు(Farmers) ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్య(Urea Shortage) పరిష్కారాన్ని కోరుతూ మిర్యాల గూడ
(Battula Lakshmareddy, Miryalaguda) ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Battula Lakshmareddy) వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. యూరియా సమస్యపై ఇప్పటిదాక ఏ ప్రజాప్రతినిధి కూడా చొరవ తీసుకోని రీతిలో ఏకంగా రూ.2కోట్ల రూపాయాలను(Rs. 2 crore donation) తన మిర్యాలగూడ నియోజవకర్గ రైతులకు యూరియా పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి సహాయంగా అందించారు. గురువారం బత్తుల తన కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) కలిసి రూ.2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఆ డబ్బును తన నియోజకవర్గంలోని రైతుల యూరియా కష్టాలు తీర్చేందుకు వినియోగించాలని బత్తుల సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. లక్ష మంది పేద రైతులకు ఒక యూరియా బస్తా ఉచితంగా అందచేయాలని విజ్ఞప్తి చేశారు.
తన కుమారుడు సాయి ప్రసన్న రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న రూ.2 కోట్ల రూపాయలను తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని భావించానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. రైతుల యూరియా కోసం వ్యక్తిగతంగా భారీ ఆర్థిక సహాయంతో ముందుకొచ్చిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
అయితే ఇటీవల లారీ యూరియా లోడ్‌ను దారి మళ్లించారంటూ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్ మెన్ పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వివాదం తన ఇమేజ్ ను డామేజ్ చేయకుండా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన కుమారుడి రిసెప్షన్ రద్దు చేసుకొని మరీ.. రైతుల కోసం రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ప్రమోషన్ స్టంట్ క్రియేట్ చేసుకున్నారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram