MLA Komatireddy Rajagopal Reddy | కసూర్తిభా పాఠశాలలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాఖీ వేడుక

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాఖీ పౌర్ణమి సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని కస్తూరిభా బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థుల మధ్య రాఖీ పండుగ జరుపుకున్నారు.

MLA Komatireddy Rajagopal Reddy | కసూర్తిభా పాఠశాలలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాఖీ వేడుక

బాలికల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యత

MLA Komatireddy Rajagopal Reddy | మునుగోడు (Munugode) కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాఖీ పౌర్ణమి (Rakhi Purnima) సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని కస్తూరిభా బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థుల మధ్య రాఖీ పండుగ జరుపుకున్నారు. పాఠశాల విద్యార్థినిలు, సిబ్బంది రాజగోపాల్‌రెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాఠశాల సమస్యలపై వారితో చర్చించారు. అడిగిన వెంటనే నీటి సమస్యను పరిష్కరించి, గ్రౌండ్ లెవెలింగ్ చేయించి, పెయింటింగ్ వేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి వేళలో పాఠశాల ముందు ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయని ఆ ఖాళీ స్థలాన్ని తమ పరిధిలోకి ఇవ్వాలని పాఠశాల సిబ్బంది కోరారు.

అక్కడే ఉన్న పోలీసులను, సీఐని పిలిచి ఆకతాయిల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడకుండా వాల్ రైటింగ్ రాయించాలని సూచించారు. ఆ ఖాళీ స్థలాన్ని ఫెన్సింగ్ వేసి పాఠశాలకు అప్పగించాలని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజుకు సూచించారు. కస్తూరిబా (Kasurthibha school) బాలికల పాఠశాలను సర్వతో ముఖాభివృద్ధి చేసే బాధ్యత నాది అని హామీనిచ్చారు. బాలికల భవిష్యత్తు అభ్యున్నతి గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తోనే కాకుండా నియోజకవర్గంలో విద్యను ప్రోత్సహించడానికి నూతన భవనాలు నిర్మించడానికి పారిశ్రామికవేత్తల ద్వారా నిధులు సమీకరించి సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా విద్యను బలోపేతం చేస్తానని  హామీ ఇచ్చారు.