MLA Komatireddy Rajgopal | ప్రజా ప్రభుత్వంలో విద్యా, వైద్యానికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన తన నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్ లోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాల, వసతి గృహాలను తనిఖీ చేశారు. విద్యార్థినిలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
మన ప్రజా ప్రభుత్వంలో విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం..
రాబోయే బడ్జెట్లో విద్య, వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయిస్తాం..
చౌటుప్పల్ లోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాల మరియు వసతి గృహాలను తనిఖీ చేయడం జరిగింది..
గురుకుల పాఠశాల, కళాశాలలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి… pic.twitter.com/o1Q2l1bNxD
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) July 22, 2024
గురుకుల పాఠశాల, కళాశాలలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే బడ్జెట్లో విద్య, వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయిస్తారన్నారు. డీఎస్సీతో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేయడం జరుగుతుందన్నారు. రైతు రుణమాఫీ 32వేల కోట్లతో పూర్తికానున్న నేపథ్యంలో ఇక విద్యా, వైద్యంపై ప్రభుత్వం దృష్టి సారించనుందన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram