TJS President Kodandaram | మంత్రివర్గంలో చోటు ఊహాగానాలే..ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్
రాష్ట్ర మంత్రివర్గంలో నాకు చోటు కల్పించబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారమంటూ ఊహాగానాలు మాత్రమేనని, మంత్రి పదవిపై ఎలాంటి చర్చకు అస్కారం లేదని ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

నేను ప్రజల మనిషి సెక్యూరిటీ అవసరం లేదు
సచివాలయంలో రాజీవ్, తెలంగాణ తల్లి విగ్రహాలు రెండు పెట్టుకోవచ్చు
గ్రూప్ పరీక్షలలో సంస్కరణలు రావాలి
గత ప్రభుత్వం జోన్‌లు..జిల్లాలను అనాలోచితంగా చేసింది
బీఆరెస్‌కు ఉద్యోగాలపై మాట్లాడే నైతిక హక్కు లేదు
విధాత, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గంలో నాకు చోటు కల్పించబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారమంటూ ఊహాగానాలు మాత్రమేనని, మంత్రి పదవిపై ఎలాంటి చర్చకు అస్కారం లేదని ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
యూనివర్శిటీ వీసీల నియామకాల్లో సామాజిక సమీకరణల నేపథ్యంలో జాప్యం జరుగుతుందని, గత ప్రభుత్వం పోస్టులు వేయకుండా నిరుద్యోగుల ప్రాణాలను తీసుకుందన్నారు. బీఆరెస్‌కు ఉద్యోగాల భర్తీపై మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం పుట్టినప్పటి నుంచి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జోన్లను ఇష్టారాజ్యంగా చేశారని, జిల్లాలు అనాలోచితంగా చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో విద్వేషపూరితంగా పోవాల్సిన అవసరం లేదని, రాజీవ్ గాంధీ, తెలంగాణ విగ్రహం రెండు సచివాలయం ప్రాంగణంలో పెట్టవచ్చన్నారు. హైడ్రా కూల్చివేతలపై అది తప్పుంది.. ఇది తప్పుందని కేటీఆర్ చెబుతున్నారని, పదేళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏమీ చేశారని కోదండరామ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి నీతులు మాట్లాడటం సిగ్గు చేటని దుయ్యబట్టారు. గ్రూపు 1,2,3,4 లకు కలిపి ఓకె పరీక్ష నిర్వహించాలని, గ్రూపు పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న తనకు ప్రభుత్వం కేటాయించిన సెక్యురిటీని నిరాకరించినట్లుగా కోదండరామ్ తెలిపారు. తాను ప్రజల మనిషినని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది నాకు అవసరం లేదని స్పష్టం చేశారు. సెక్యూరిటీ వల్ల ప్రజలతో సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్చగా తనకు తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు. భద్రతా సిబ్బంది ఉంటే ప్రజలు తన వద్దకు రాకుండా నిలువరించే ప్రమాదం లేకపోలేదన్నారు.