MLC Deshapati Srinivas | తెలంగాణ తల్లి విగ్రహ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం సరికాదు : ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతుండటం ముమ్మాటికి తెలంగాణ అస్తిత్వంపై దాడేనని బీఆరెస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు.

ఇది మూమ్మాటికి తెలంగాణ అస్తిత్వంపై దాడినే
సీఎం రేవంత్‌రెడ్డి వలసవాద పుత్రుడు
MLC Deshapati Srinivas | తెలంగాణ తల్లి విగ్రహం(Telangana mother statue) పెట్టాలనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం( Rajiv Gandhi statue) పెడుతుండటం ముమ్మాటికి తెలంగాణ అస్తిత్వంపై దాడేనని బీఆరెస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(MLC Deshapati Srinivas) విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. అధిష్టానం మెప్పు కోసం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ఎదురుగా(Opposite Secretariat) రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటున్నాడని, రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని, ఆయన వలసవాద పుత్రుడని దేశపతి విమర్శించారు. దేశం ఓ వైపు స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకుంటుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ స్వాభిమానం మీద దాడి చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రైఫిల్ పట్టుకుని బయలుదేరిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక జై తెలంగాణ నినాదం మసక బారిపోయిందన్నారు. జై తెలంగాణ స్థానంలో జై సోనియా, జై కాంగ్రెస్ నినాదాలు తెచ్చారన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ అధికార చిహ్నంలోని చార్మినార్, కాకతీయ తోరణాలను రాచరిక చిహ్నాలని హేళన చేశారని ఆరోపించారు. మరోసారి తెలంగాణ స్వాభిమానాన్ని దెబ్బతీసేందుకు తెలంగాణ సెక్రటేరియట్ (Telangana Secretariat)ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్(Constitution maker BR Ambedkar)కు నివాళిగా తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టామని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3(Article 3 of the Constitution) ద్వారా తెలంగాణ ఏర్పడింది కనుక సచివాలయానికి ఆయన పేరు పెట్టామని గుర్తు చేశారు. సచివాలయం ఎదురుగా అమరజ్యోతి భవనం ఏర్పాటు చేసిన ఉద్దేశ్యం నిత్యం అమరుల స్ఫూర్తిగా పాలన జరగాలని, సచివాలయం, అమరజ్యోతి మధ్య ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమేనన్నారు. సచివాలయంలో ఉండాల్సింది వ్యక్తులు, నాయకుల విగ్రహం కాదని, తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం కావాలా రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కావాలా ప్రజలు తేల్చుకోవాలని, కావాలంటే రాజీవ్ గాంధీ విగ్రహాలు బయట ఎన్నైనా పెట్టుకోవచ్చని, సచివాలయం ఎదుట పెట్టకూడదని హితవు పలికారు.
ప్రేరణగా తెలంగాణ తల్లి విగ్రహం
దేశ స్వాతంత్ర ఉద్యమంలో భరతమాత ఓ ప్రేరణగా ఉంటే(If Bharatamata is an inspiration).. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి ప్రేరణగా నిలిచిందని(Telangana mother was an inspiration), అనేక చర్చల తర్వాతే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడం జరిగిందన్నారు. తెలంగాణ బిడ్డ అప్పటి సీఎం అంజయ్యను(Anjaiah was the then CM) రాజీవ్ గాంధీ అవమానించిన చరిత్ర అందరికి తెలిసిందేనని, అంజయ్యకు జరిగిన అవమానం నుంచే ఒక పార్టీ పుట్టిందని, ఆ పార్టీలో నుంచి వచ్చిన వాడే రేవంత్ రెడ్డి అన్నారు. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణ కు ఏం సంబంధమని, సోనియాకైనా తెలంగాణతో సంబంధం ఉందన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే ముందు తెలంగాణ మేధావులతో ఏమైనా చర్చలు జరిపారా అని, కనీసం కోదండరాం, హరగోపాల్, అందెశ్రీల అభిప్రాయాలను తెలుసుకోండని, వారు ముగ్గురు కూడా రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ వద్దని రేవంత్‌కు చెబితే మంచిదని, ఇప్పటికైనా రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. రాజీవ్ విగ్రహం పెట్టాలని మొండికేస్తే తెలంగాణలో అలజడి మొదలవుతుందని, మేము కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ అస్తిత్వం (existence of Telangana)మీద దాడి చేయడం మానండని, గతంలో కాంగ్రెస్ తీరు వల్లే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని, మళ్ళీ తెలంగాణ అస్తిత్వంపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే దాడిని కొనసాగిస్తోందని, గతంలో ఏపీ సచివాలయం ముందు తెలుగు తల్లి విగ్రహం(Telugu mother statue) ఉండేదని, కనీసం ఆ స్ఫూర్తితోనైనా తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కోరారు.