MLC Elections: ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికలు
ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఉపాధ్యాయులు పోలీసుల బందోబస్తు.. 144సెక్షన్ అమలు.. విధాత: నాగర్ కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే ఓటర్లు పోలింగ్(Poling) కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు(police) గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జిల్లాలో 1822 మంది ఓటర్లు ఉండగా 1,169 మంది పురుషులు, 659 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. జిల్లాలో […]
- ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఉపాధ్యాయులు
- పోలీసుల బందోబస్తు.. 144సెక్షన్ అమలు..
విధాత: నాగర్ కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే ఓటర్లు పోలింగ్(Poling) కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు(police) గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

జిల్లాలో 1822 మంది ఓటర్లు ఉండగా 1,169 మంది పురుషులు, 659 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఓటర్లు కేంద్రాల వద్ద ప్రశాంతంగా తమ ఓటు హక్కును సద్వినియోగపరచుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

నారాయణపేట: ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
నారాయణపేట జిల్లా ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉపాద్యాయులు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 664 ఓట్లకు గాను కోస్గి, మద్దూర్, నారాయణపేట, మరికల్, మక్తల్ మండల కేంద్రాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సిఐ స్థాయి పోలీస్ అధికారితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 80 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram