MLC Jeevan Reddy | దేశ ప్రగతికి నెహ్రు మార్గదర్శి.. నెహ్రు ప్రతిష్టను మసకబార్చేందుకు ఆరెస్సెస్, బీజేపీ కుట్రలు: జీవన్ రెడ్డి
భారత దేశం నేడు సాధించిన ప్రగతికి దేశ తొలి ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రు దూరదృష్టితో వేసిన ప్రణాళికాయుత ప్రగతి మార్గాలే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి అన్నారు

వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి
విధాత: భారత దేశం నేడు సాధించిన ప్రగతికి దేశ తొలి ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రు దూరదృష్టితో వేసిన ప్రణాళికాయుత ప్రగతి మార్గాలే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా ఇందిరా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, జీవన్‌రెడ్డి, విహెచ్ ప్రభృతులు నెహ్రుకు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ నెహ్రు ఆధ్వర్యంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు దేశం కోసం నెహ్రు చేసిన సేవలను, త్యాగాన్ని తగ్గించి ఆయన ప్రతిష్టతను మసకబార్చే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. నెహ్రూను విమర్శించే వాళ్ళను చూసి నిజమైన దేశ భక్తులు ఇప్పుడు బాధ పడుతున్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తీయాలని చూస్తుందని ఆరోపించారు.
ఎస్సీ,ఎస్టీ, బీసీల హక్కులను పొందకుండా మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, ఆర్థిక వెనుకబాటు తనం అనే నెపంతో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు తీసుకొస్తున్నారని ఆరోపించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ,బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుందన్నారు. దేశంలో 52 % రిజర్వేషన్లు ఉంటే ఎస్సీ 15 % , ఎస్టీ 10% బలహీన వర్గాలు 50శాతం ఉన్నారని, మిగిలింది 25శాతంలో హిందు సమాజం, ముస్లిం సమాజం ఉందన్నారు. ఓట్ల రాజకీయాలతో మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొట్టల్ని చూస్తుందన్నారు.
మాజీ ఎంపీ. హనుమంతరావు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టినప్పుడు మన దేశంలో గుండు సూది కూడా తయారు కాలేదని, నెహ్రు మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి దేశాన్ని పంచవర్ష ప్రణాళికలతో, నవరత్న పరిశ్రమలతో ముందుకు తీసుకెళ్లాడని కొనియాడారు. దేశంలో డ్యామ్‌లు కట్టించింది నెహ్రునే అని, ప్రధాని మోదీ హయాంలో దేశీయ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్ని ప్రైవేటు పరమవుతు దేశ సంపద కార్పోరేట్ల పాలవుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు తగ్గిపోతున్న మేరకు రిజర్వేష్ల అవకాశాలు కూడా సన్నిగిల్లుతున్నాయన్నారు.
రాజీవ్ గాంధీ తెచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మోదీ ప్రైవేట్ చేస్తుండని విమర్శించారు. అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగాన్ని మోదీ మార్చాలని చూస్తుండని, బీజేపీ వాళ్ళు రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్నారే తప్ప అభివృద్ధి చెప్పడం లేదన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తుండని, ప్రజలు నరేంద్ర మోదీ హటావ్, దేశ్ బచావ్ అంటున్నారన్నారు. దేశంలో జూన్ 5తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తదని ధీమా వ్యక్తం చేశారు.