Warangal: సికింద్రాబాద్ నుంచి జనగామకు లోకల్ ట్రైన్ మంజూరు చేయాలి.. కిషన్ రెడ్డికి MLC శ్రీనివాస్‌రెడ్డి లేఖ

ఎంఎంటిఎస్ ట్రైన్ జనగామ వరకు పొడగించాలి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా కేంద్రం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు లోకల్ ట్రైన్ మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సోమవారం లేఖ రాశారు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని నగరానికి సమీపంలో వున్న జిల్లా కేంద్రాల్లో జనగామ ఒకటి. ఈ జిల్లా కేంద్రంతోపాటు, చుట్టు పక్కల పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలాది […]

Warangal: సికింద్రాబాద్ నుంచి జనగామకు లోకల్ ట్రైన్ మంజూరు చేయాలి.. కిషన్ రెడ్డికి MLC శ్రీనివాస్‌రెడ్డి లేఖ
  • ఎంఎంటిఎస్ ట్రైన్ జనగామ వరకు పొడగించాలి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా కేంద్రం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు లోకల్ ట్రైన్ మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సోమవారం లేఖ రాశారు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని నగరానికి సమీపంలో వున్న జిల్లా కేంద్రాల్లో జనగామ ఒకటి. ఈ జిల్లా కేంద్రంతోపాటు, చుట్టు పక్కల పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది హైదరాబాద్ వెళ్తుంటారు.

జనగామ, ఆలేరు, భువనగిరి పట్టణాలతోపాటు, పెంబర్తి, వంగపల్లి, రాయగిరి, బీబీనగర్, ఘట్కేసర్ ల నుంచి వ్యక్తిగత పనుల మీద చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు. రోజు వారి కూలీలు, వివిధ షాపులలో పనిచేసేవారు, వ్యాపారపరంగా వెళ్లేవారు ఇలా వేలాది మంది నిత్యం జనగామ నుంచి హైదరాబాద్ వెళ్తుంటారు. అయితే వారు అనునిత్యం ట్రైన్ లలో వ్యయప్రయాసలకోర్చి, చిరు సంపాదనతో జీవితాలు వెల్లదీసుకుంటున్నారు. విపరీతమైన రోజు వారి ప్రయాణ ఖర్చులు భరించుకోలేకపోతున్నారు. ట్రైన్ ప్రయాణమైతే సీజన్ టిక్కెట్తో వారికి సౌకర్యంగా వుంటుంది.

అందుకే ఎక్కువ మంది చిరుద్యోగులు, వ్యాపారులు రైలు ప్రయాణం కోరుకుంటున్నారు. అలాంటి వారు సరైన రైలు సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అందుబాటులో వున్న ట్రైన్లు సరిపోవడం లేదు. నిత్యం రద్దీతో వెళ్తుంటాయి. ప్రయాణికులు కనీసం నిలబడడానికి కూడా చోటు లేకుండా వుంటుంది. ఎన్నో తంటాలు పడుతూ, కాలు మోపలేని స్థలంలో కూడా వేలాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా లోకల్ ట్రైన్ అందుబాటులో వుంటే ఎంతో ఉపయోగంగా వుంటుందని ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు.

లోకల్ ట్రైన్ మూలంగా ఇతర ప్రయాణికులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయాణ ఖర్చులు తడిసి మోపడౌతున్నందున ప్రజలు రైలు ప్రయాణాలే కోరుకుంటారు. సౌకర్యం కూడా.. అందువల్ల ప్రజల కోరిక మేరకు లోకల్ ట్రైన్ జనగామ వరకు ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు.

యాదాద్రి వరకు విస్తరిస్తున్న ఎంఎమ్ఎఎస్ రైల్వే ట్రాక్‌ను కూడా జనగామ వరకు పొడిగిస్తే భవిష్యత్తులో జిల్లా ప్రజలు ఎంతో సౌకర్యవంతంగా వుంటుందని పోచంపల్లి పేర్కొన్నారు. ఈ నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఈ విషయం ఆయనతో చర్చించి, ఎమ్ఎంటీఎస్ రైల్వేలైను, లోకల్ ట్రైన్‌ను అత్యవసరంగా మంజూరు చేయాలని కోరారు.