మేడారం జాతరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి …పార్లమెంట్‌లో ఎంపీ ఈటల రాజేందర్
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఎంపీ ఈటల రాజేందర్.. రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ను కోరారు. రూల్ 377 కింద పార్లమెంట్ ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు

- మేడారం జాతరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి
- పార్లమెంట్‌లో ఎంపీ ఈటల రాజేందర్
న్యూఢిల్లీ : మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఎంపీ ఈటల రాజేందర్.. రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ను కోరారు. రూల్ 377 కింద పార్లమెంట్ ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ములుగు జిల్లా మేడారం గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని తెలిపారు. ఇది ఏషియాలోని అతిపెద్ద గిరిజన పండుగని, తెలంగాణ ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి కోటి మంది భక్తులు జాతరకు వస్తారని పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు రైల్వే లైన్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రోడ్డు ప్రయాణం ఎక్కువ ఖర్చుతో కూడినది, ట్రాఫిక్ జామ్ సమస్యలు, యాక్సిడెంట్ల వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దగ్గరలో ఉన్న వరంగల్ రైల్వే జంక్షన్, సిర్పూర్ – కాగజ్నగర్, లేదా మణుగూరుకు రైల్వే లైన్ ఏర్పాటు చేయడం ద్వారా గిరిజనులకు తక్కువ ఖర్చుతో భద్రతతో కూడా ప్రయాణం అందించవచ్చని సూచించారు. బొగత జలపాతం, రామప్ప దేవాలయం కూడా ఉండడం వల్ల ఏకో టూరిజం కూడా డెవలప్ అవుతుందన్నారు. కాబట్టి ఈ రైల్వే లైన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రిని ఎంపీ ఈటల కోరారు.