Nalgonda : ఏసీబీకి చిక్కిన నల్లగొండ మత్స్యశాఖ అధికారిణి
నల్లగొండ మత్స్యశాఖ అధికారిణి చరితారెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
విధాత, నల్లగొండ: నల్లగొండ(Nalgonda) జిల్లా మత్స్యశాఖ అధికారిణి(Fisheries Officer) చరితారెడ్డి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి(ACB) చిక్కారు. మత్స్య సహకార సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు అనుమతి కోసం ఆమె బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో బాధితుడి నుంచి రూ.20 వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ చరిత రెడ్డి(Charitha Reddy ) ఏసీబీకి చిక్కింది. ఆమెపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram