ఈటెల సమక్షంలో బీజేపీలో చేరిన ఎన్నారై కిరణ్ కుమార్ కాళ్లకూరి
మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర సమక్షంలో ఎన్నారై పారిశ్రామికవేత్త సినీ నిర్మాత వెంకట కిరణ్ కుమార్ కాళ్ళకూరి భారతీయ జనతా పార్టీలో చేరారు

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఈటల
విధాత: మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర సమక్షంలో ఎన్నారై పారిశ్రామికవేత్త సినీ నిర్మాత వెంకట కిరణ్ కుమార్ కాళ్ళకూరి భారతీయ జనతా పార్టీలో చేరారు. గల్ఫ్ దేశాల్లో వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో అపారమైన అనుభవం గడించి అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పని చేసిన కిరణ్ కుమార్ కాళ్ళకూరి బీజేపీలో చేరడాన్ని ఎంపీ ఈటెల స్వాగతించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ కాళ్లకూరిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో సాధించిన ఘన విజయాలను చూసి తాను బీజేపీ పట్ల ఆకర్షితులైనట్లు కిరణ్ కుమార్ కాళ్లకూరి మీడియాకు వెల్లడించారు. తను బాల్యంలో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించే శిక్షణ తరగతులకు హాజరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారతదేశ సార్వభౌమత్వం, శాంతి భద్రతలు, అగ్రదేశాల సరసన నిలిపే అభివృద్ధి మోడీ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని కిరణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. భారత దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం మోడీ అంటే ఒక భారత దేశ బ్రాండ్ గా ప్రజలు భావిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కిరణ్ కుమార్ కాళ్లకూరి తెలుగులో హాష్టాగ్ కృష్ణా రామ, గ్రే సినిమాలను నిర్మించారు.