• Telugu News
  • /Telangana

వరదల వలన ప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి :మంత్రి డాక్టర్ దనసరి సీతక్క

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు అనేక గ్రామాలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఈ ఏడాది ఎలాంటి ప్రాణనష్టం ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క సూచించారు.

Reported by: Subbu | తెలంగాణ‌ | Jun 07, 2024, 4:33 pm IST
Read Time: 3 mins
వరదల వలన ప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి :మంత్రి డాక్టర్ దనసరి సీతక్క

గత ఏడాది వరదల కారణంగా ముంపుకు గురైన గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలి.

విధాత, వరంగల్ ప్రతినిధి:వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు అనేక గ్రామాలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఈ ఏడాది ఎలాంటి ప్రాణనష్టం ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క సూచించారు. శుక్రవారం ములుగు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి తగు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు పరిశీలించి ఏమైనా మరమ్మతులు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే డీఎంఎఫ్ట్ నిధులు మంజూరు చేస్తానని అధికారులకు సూచించారు.

కరకట్ట నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. గోదావరి, జంపన్న వాగు ఉదృతి మూలాన గత ఏడాది అనేక గ్రామాల్లో నీరు చేరి ముంపునకు గురైన పరిస్థితి నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముంపునకు గల కారణాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు.
మారేడు గుండ చెరువు కట్ట నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. రైతులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందరూ పని చేయాలని అధికారులకు మంత్రి సూచన చేశారు.