కార్మికుల హక్కుల సాధనలో కొనసాగే పోరాటాలకు తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అండగా ఉంటుందని టీఆర్ఎస్ అధినేత్రి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే వేడుకలలో భాగంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మేడే పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. కేంద్ర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కొత్త చట్టాలతో కార్మికుల హక్కులను హరించాలని చూస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పోరాడుతుందని తెలిపారు. కార్మికులందరికీ టీఆర్ఎస్ రక్షణగా ఉంటుందన్నారు. అలుపెరుగని పోరాటంతో ఆశయాల సాధన కోసం నిరంతరం శ్రమించే కార్మిక లోకానికి వందనాలు చెబుతున్నామని తెలిపారు.
బాదన్ కుర్తిని బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేయాలి
అంతకుముందు కవిత బుద్ద జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ..గౌతమ బుద్ధుడి స్తూపం ఉన్న ఖానాపూర్ మండలంలోని బాదన్ కుర్తిని బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. బుద్ధుడి బోధనలను ఇక్కడి నుంచే దక్షిణ భారత దేశంలో ప్రచారం చేశారని ప్రశస్తి అని..ఈ ప్రాంతాన్ని బౌద్ద క్షేత్రంగా అభివృద్ధి చేస్తే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది అని తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలని కోరారు. బుద్దుడు సిద్ధార్థుడిగా మారి ప్రపంచానికి వెలుగునిచ్చాడు అని, ప్రతి ఒక్కరు తమలోని సిద్ధార్థుడిని బుద్ధుడిగా మలచుకోవాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి :
ముంబయిలో రూ.1,745 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత
నర్మదలో దారుణం: బర్గి డ్యామ్‌లో పడవ మునిగి 9 మంది మృతి | నిర్లక్ష్యంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం
