TGSPDCL | టీజీఎస్పీడీసీఎల్‌గా మారిన టీఎస్ఎస్పీడీసీఎల్.. కొత్త లోగో ఆవిష్కరణ
TGSPDCL | ప్రభుత్వ విభాగాలన్నీ ఇక నుంచి తెలంగాణను టీఎస్‌కు బదులుగా టీజీగానే ప్రస్తావించాలని ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా టీఎస్ఎస్పీడీసీఎల్ ను టీజీఎస్పీడీసీఎల్‌గా మార్చినట్లు చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫారుఖీ శనివారం ప్రకటించారు.

TGSPDCL | హైదరాబాద్ : ప్రభుత్వ విభాగాలన్నీ ఇక నుంచి తెలంగాణను టీఎస్‌కు బదులుగా టీజీగానే ప్రస్తావించాలని ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారిక సమాచారాల్లో అంతటా టీజీగా ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు, అటామనస్ విభాగాలన్నింటిలోనూ టీఎస్‌కు బదులుగా టీజీని చేర్చుతున్నారు.
తాజాగా టీఎస్ఎస్పీడీసీఎల్ ను టీజీఎస్పీడీసీఎల్‌గా మార్చినట్లు చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫారుఖీ శనివారం ప్రకటించారు. ఈ మేరకు టీజీఎస్పీడీసీఎల్ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఇక నుంచి అన్ని ప్రభుత్వ డాక్యుమెంట్లలో ఈ లోగోను పొందుపరచాలని, టీఎస్‌కు బదులుగా టీజీ రాయాలని ఆదేశించారు. జనరల్ మేనేజర్లు, జాయింట్ సెక్రటరీలు, సూపరింటెండెంట్ ఇంజినీర్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.