Hyderabad | మగాడిపై లైంగికదాడి.. ఆపై కత్తితో పొడిచి చంపిన ఆ నలుగురు..
Hyderabad | మద్యానికి బానిసైన ఓ నలుగురు యువకులు అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. ఓ 45 ఏండ్ల వ్యక్తిపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్( Hyderabad ) నగరంలోని నాచారం పోలీసు స్టేషన్( Nacharam Police Station ) పరిధిలో వెలుగు చూసింది.
Hyderabad | హైదరాబాద్ : మద్యానికి బానిసైన ఓ నలుగురు యువకులు అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. ఓ 45 ఏండ్ల వ్యక్తిపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్( Hyderabad ) నగరంలోని నాచారం పోలీసు స్టేషన్( Nacharam Police Station ) పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ కల్యాణ్‌పురికి చెందిన ఓ 45 ఏండ్ల వ్యక్తి పెయింటర్‌గా జీవితం కొనసాగిస్తున్నాడు. అయితే ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జిల్లెలగూడలోని తన సోదరుడి నివాసానికి వెళ్లాడు. మళ్లీ తిరిగి అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో తన ఇంటికి బయల్దేరాడు పెయింటర్. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఎల్‌బీనగర్ జంక్షన్ వద్ద నిల్చుండగా, అటు నుంచి ఓ కారు వచ్చింది. ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు లిప్ట్ కావాలని పెయింటర్ అడగ్గా.. కారులో ఉన్న నలుగురు యువకులు అంగీకరించారు.
కారులో ఎక్కిన పెయింటర్‌కు మద్యం మత్తులో ఉన్న ఆ నలుగురు యువకులు చుక్కలు చూపించారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టారు. ఆ యువకుల ఆగడాలు భరించలేక.. ఎన్‌జీఆర్ఐ వద్దకు వచ్చాక కారు వేగం తగ్గడంతో.. దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, సాధ్యం కాలేదు. సోమవారం తెల్లవారుజామున నాచారం పారిశ్రామిక వాడలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో 8సార్లు పొడిచారు. బాధిత వ్యక్తి తప్పించుకుని, కొంతదూరం పరుగెత్తి పడిపోయాడు. పెయింటర్ చనిపోయాడని భావించిన యువకులు అక్కడ్నుంచి పారిపోయారు. ఉదయం 5.30 గంటలకు తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పెయింటర్‌ను గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆస్పత్రికి తరలించే క్రమంలో తనను కిడ్నాప్ చేసి లైంగికంగా హింసించారని చెప్పి ప్రాణాలొదిలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.
లైంగిక దాడికి పాల్పడి కత్తి పోట్లకు పాల్పడిన వారిని నాచారం రాఘవేంద్ర నగర్‌కు చెందిన మహమ్మద్ జునైద్ అలియాస్ జాఫర్(18), ఇందిరానగర్ వాసి షేక్ సైఫుద్దీన్(18), కార్తికేయనగర్‌లో ఉండే పొన్నా మణికంఠ(21), మల్లాపూర్(కేఎల్ రెడ్డినగర్)కు చెందిన మైనర్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram