TPCC Working President Jaggareddy | క్రైమ్ లీడర్స్.. లూజ్ లీడర్స్ కి కరక్ట్ మొగుడు రేవంత్ రెడ్డే : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
ఇప్పుడున్న రాజకీయాల్లో క్రైమ్ లీడర్స్.. లూజ్ లీడర్స్ కి కరెక్ట్ మొగుడు రేవంత్ రెడ్డే నని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.

నీ అయ్యజాగీరా? రాజీవ్ గాంధీ విగ్రహం తీయడానికి
కేటీఆర్ ను నిలదీసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
విధాత: ఇప్పుడున్న రాజకీయాల్లో క్రైమ్ లీడర్స్.. లూజ్ లీడర్స్ కి కరెక్ట్ మొగుడు రేవంత్ రెడ్డే నని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తా అనడానికి నువ్వు ఎవ్వడు..నీ జాగీరా..? నీ అయ్య జాగీరా? అని కేటీఆర్ ను నిలదీశారు. రాజీవ్ గాంధీ టెక్నాలజీ తోనే కదా నువ్వు ఉద్యోగం తెచ్చుకుంది నిజం కాదా కేటీఆర్ అని ప్రశ్నించారు. నువ్వు తీసేస్తే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? అని అన్నారు. తల్లి గుండెల్లో ఉండాలి.. అందుకే తాము తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ లోపల పెడతున్నామన్నారు. ఐనా… మీకు అధికారం రావడం అనేది కల అని ఎద్దేవా చేశారు. ఔను మేము సోనియా గాంధీ..రాహూల్ గాంధీల కు నీతి కలిగిన గులాములం.. ఢిల్లీ వెళ్లి మీరు కాళ్ళు మొక్కింది కూడా గులాం గిరి లో భాగమేనా? అని కేటీఆర్ ను అడిగారు. ఐటి కి ఆద్యుడు రాజీవ్ గాంధీ నే అని కేసీఆర్ మాట్లాడిన వీడియోలను జగ్గారెడ్డి ప్రదర్శించారు.
కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు… ఏం మాట్లాడాలో మాట్లాడాలో తోయడం లేదని, కోచింగ్ తీసుకో బెటర్ అన్నారు. కేటీఆర్ కి కొంత ట్రైనింగ్ ఇప్పించండని కేసీఆర్ కు హితవు పలికారు.