నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు వ్యవహారం వివాదస్పదమైంది.
పోలీస్ బందోబస్త్ మధ్య విగ్రహాన్ని తొలగించిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు..విగ్రహం గద్దెను నేలమట్టం చేశారు. విగ్రహం తొలగింపుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజునే ఈ ఘటన చోటుచేసుకోవడం సహజంగానే పెద్ది అభిమానులను, బీఆర్ఎస్ శ్రేణులను ఆగ్రహానికి గురి చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే పెద్ది విగ్రహాన్ని తొలగించిందని ఆరోపిస్తున్నారు.
పెద్ది విగ్రహం తొలగింపు చర్యను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో నర్సంపేట, నల్లబెల్లిలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. . నల్లబెల్లిలోని పెద్ది నివాసం చుట్టూ 400 మంది పోలీసుల మోహరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో నల్లబెల్లిలోని ఆయన స్వగృహం వద్ద విషాద వాతావరణం నెలకొంది.పెద్ది సుదర్శన్ విగ్రహం వద్ద భావోద్వేగంతో ఆయన సతీమణి పెద్ది స్వప్న కన్నీటి పర్యంతమయ్యారు. భర్తను తలచుకొని కన్నీటి పర్యంతమవుతూ “నువ్వు లేని రోజు చూడు.. ఎంత అరాచకమో” అంటూ విలపించడం అక్కుడున్న వారందరిని కలిచివేసింది.
పెద్ది విగ్రహం వద్ద కన్నీటి పర్యంతమైన పెద్ది స్వప్న 😭💔
నర్సంపేటలో అర్దరాత్రి దొంగ చాటుగా
కాంగ్రెస్ సర్కార్ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడంతో నల్లబెల్లిలోని ఆయన స్వగృహం వద్ద విషాద వాతావరణం నెలకొంది.సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న విగ్రహం వద్ద రోదిస్తూ… pic.twitter.com/Gt3dLGkKv7
— BRS Party (@BRSparty) August 18, 2026
