TPTF | కోల్‌కత్తాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం చేసిన దుండగులను శిక్షించాలి…టీపీటీఎఫ్ కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన

దేశంలో నిత్యం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను నిలువరించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని, మహిళలపై హింసను ప్రేరేపిస్తున్న డ్రగ్స్, గంజాయి, మద్యం , పోర్న్ మీడియా వంటి వాటిని నిషేధించి వాటిపై ఉక్కు పాదం మోపాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు.

TPTF | కోల్‌కత్తాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం చేసిన దుండగులను శిక్షించాలి…టీపీటీఎఫ్ కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన

విధాత, వరంగల్ ప్రతినిధి : దేశంలో నిత్యం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను నిలువరించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని, మహిళలపై హింసను ప్రేరేపిస్తున్న డ్రగ్స్, గంజాయి, మద్యం , పోర్న్ మీడియా వంటి వాటిని నిషేధించి వాటిపై ఉక్కు పాదం మోపాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. కోల్ కత్తా ఆర్జీ కర్ వైద్య కళాశాలలో దారుణ అత్యాచారం, హత్యకు గురైన సంఘటన పట్ల ఆ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాశీబుగ్గ లో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వత్తుల తో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా భోగేశ్వర్ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్ హత్యకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని అన్నారు. గాయపడిన మానవ హృదయం రోడ్డెక్కి రోడిస్తుంటే ప్రభుత్వాలు నిందితుల్ని ఎలా కాపాడాలో వ్యూహాలు పన్ను తున్నట్లు కనిపిస్తుందని అన్నారు. ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే దృష్టి పెట్టడం కాకుండా చిత్తశుద్ధితో శాశ్వత రక్షణ మార్గాలపై దృష్టి పెట్టాలని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు పనిచేసే చోట భద్రత కల్పించాలని, స్త్రీలను చిన్న చూపు చూస్తూ, కేవలం లైంగిక పరంగా మాత్రమే చూసే ఆధిపత్య భావజాలాన్ని నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి పూజారి మనోజ్ ఉమ్మడిజిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి ఉట్కూరి అశోక్ జిల్లాఉపాధ్యక్షులు జె.స్వామి, ఎం.వెంకట్,బెల్లంకొండ పూర్ణ చందర్,కనక స్వామి,వి. విమల తదితరులు పాల్గొన్నారు.