రామరాజ్యం కావాలంటే బీ‌ఆర్‌ఎస్ గెలవాలి…మేము బయటకు వచ్చినప్పుడే కాంగ్రెస్ చచ్చిపోయింది

తమ లాంటి కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు బయటికి వచ్చినపుడే ఆ పార్టీ చచ్చిపోయింది అని మాజీ ఎమ్మెల్యే పి .విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం జూబ్లీ‌హిల్స్ బీ‌ఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు.

  • By: Tech |    telangana |    Published on : Oct 13, 2025 10:03 PM IST
రామరాజ్యం కావాలంటే బీ‌ఆర్‌ఎస్ గెలవాలి…మేము బయటకు వచ్చినప్పుడే కాంగ్రెస్ చచ్చిపోయింది

విధాత, హైదరాబాద్ : తమ లాంటి కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు బయటికి వచ్చినపుడే ఆ పార్టీ చచ్చిపోయింది అని మాజీ ఎమ్మెల్యే పి .విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం జూబ్లీ‌హిల్స్ బీ‌ఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. ‘నన్ను కూడా టికెట్ కోసం డబ్బులు అడిగిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నేను కష్టకాలంలో ఉన్నపుడు బీ ఆర్ ఎస్ రాజకీయంగా నాకు అండగా నిలిచింది. నేను ఉన్నంత వరకు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ని గెలవనివ్వను. గోపినాథ్ కుటుంబానికి నేను అండగా ఉంటాను. సునీత గెలవడం ఖాయం’ అని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. శివమ్మ పాపిరెడ్డి హిల్స్ రిజర్వాయర్ కు మాగంటి గోపినాథ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
రామరాజ్యం కావాలంటే బీ ఆర్ ఎస్ గెలవాల అని, రావణ రాజ్యం కొనసాగాలంటే కాంగ్రెస్ కు ఓటెయ్యాలన్నారు. గోపన్న ఎపుడూ ప్రజల కోసం పని చేస్తూ ప్రజల మధ్యనే ఉండే వారని, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎపుడూ ఊహించలేదన్నారు. గోపన్న ఆశయ సాధనకు మీ సహకారం కావాలని కార్యకర్తలను విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.