గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీ.. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఎన్‌హెచ్‌ఆర్సీ
రిజన రైతుపై థర్డ్ డిగ్రీకి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

నల్లగొండ, అక్టోబర్ 10(విధాత): గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీకి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యూరియా కోసం ధర్నా చేసినందుకు గిరిజన రైతు సాయి సిద్ధును పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. ఇంతటితో ఆగకుండా తన భార్యను కులం పేరుతో దూషిస్తూ, అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సామాజికవేత్త రేవంత్ సదరు ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్‌పై మానవహక్కులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జాతీయ మానవహక్కుల కమిషన్ ఉన్నత స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.