మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంకు మాతృవియోగం
మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ తల్లి లక్ష్మి బాయి (100) అనారోగ్యంతో బాధపడుతూ మధ్యాహ్నం 2:45 నిమిషాలకు వరంగల్
సంతాపం తెలిపిన సీఎం రేవంత్
విధాత, వరంగల్ ప్రతినిధి: మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ తల్లి లక్ష్మి బాయి (100) అనారోగ్యంతో బాధపడుతూ మధ్యాహ్నం 2:45 నిమిషాలకు వరంగల్ అరవింద హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. పోరిక బలరాం నాయక్ తల్లి లక్ష్మి బాయి మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన లక్ష్మి బాయి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram