అధిక ఫీజల స్కూళ్లపై చర్యలకు రంగం సిద్ధం

విధాత,హైదరాబాద్‌: జీవో 46కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కూళ్లపై చర్యలకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది.పాఠశాలల అనుమతులు రద్దు చేస్తే వచ్చే ఇబ్బందులపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.మణికొండలోని మౌంట్‌ లిటేరాజ్‌ స్కూల్‌, బంజారాహిల్స్‌లోని మెరీడియన్‌ స్కూల్‌, హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌, అమీర్‌పేట్‌లోని నీరజ్‌ పబ్లిక్‌ స్కూల్‌, జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌, బేగంపేటలోని సెయింట్‌ ఆండ్రూస్‌ స్కూల్‌, డీడీ కాలనీలోని నారాయణ స్కూల్‌, లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్స్‌పై అధికారులు నివేదిక […]

  • Publish Date - July 9, 2021 / 06:55 AM IST

విధాత,హైదరాబాద్‌: జీవో 46కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కూళ్లపై చర్యలకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది.పాఠశాలల అనుమతులు రద్దు చేస్తే వచ్చే ఇబ్బందులపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
మణికొండలోని మౌంట్‌ లిటేరాజ్‌ స్కూల్‌, బంజారాహిల్స్‌లోని మెరీడియన్‌ స్కూల్‌, హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌, అమీర్‌పేట్‌లోని నీరజ్‌ పబ్లిక్‌ స్కూల్‌, జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌, బేగంపేటలోని సెయింట్‌ ఆండ్రూస్‌ స్కూల్‌, డీడీ కాలనీలోని నారాయణ స్కూల్‌, లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్స్‌పై అధికారులు నివేదిక ఇచ్చారు.