Rain Alert | రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు..!
Rain Alert | రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్( Rain Alert ).. ఇప్పటికే కుండపోత వర్షాలతో( Heavy Downpour ) అతలాకుతలమవుతున్న తెలంగాణ( Telangana )కు భారీ వర్ష సూచన ఉంది. రాబోయే నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు( Heavy Rains ) కురుస్తాయని వాతావరణ శాఖ( IMD Hyderabad ) హెచ్చరించింది.

Rain Alert | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు( Rains ) కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షం( Heavy Downpour ) కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరాకు, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రహదారులు చెరువులను తలపించాయి. కొన్ని ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్రం అంతరాయం కలగడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇక రాబోయే నాలుగు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం( IMD Hyderabad ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని సూచించింది.
కాగా శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
శుక్రవారం నాడు హైదరాబాద్ మహానగరంలో మధ్యాహ్నం వరకు ఎలాంటి వర్షం పడే అవకాశం లేదని తెలిపింది. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు ఇండ్లకే పరిమితం కావాలని సూచించింది వాతావరణ శాఖ.