Fire Accident In Bus | హైదరాబాద్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి భయాందోళన. అప్రమత్తంగా దిగిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మియాపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడం భయాందోళన కల్గించింది. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు చేరుకున్న సమయంలో బస్సులోని ఏసీ విభాగం నుంచి మంటలు ప్రారంభమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కిందికి దిగారు. చూస్తుండగానే అగ్నికీలలు బస్సు మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు చాల భాగం మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయపడ్డారు.