Etala Rajender | పోచమ్మ ఆలయంలో ఎంపీ ఈటల పూజలు
బోనాల పండుగ పురస్కరించుకుని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మన్సూరాబాద్, సహరారోడ్ లోని పోచమ్మ తల్లి దేవాలయం, హయత్ నగర్, రాఘవేంద్ర నగర్ కాలనీలలోని అమ్మవారి ఆలయాల్లో బోనాల వేడుకలలో పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు
విధాత, హైదరాబాద్ : బోనాల పండుగ పురస్కరించుకుని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మన్సూరాబాద్, సహరారోడ్ లోని పోచమ్మ తల్లి దేవాలయం, హయత్ నగర్, రాఘవేంద్ర నగర్ కాలనీలలోని అమ్మవారి ఆలయాల్లో బోనాల వేడుకలలో పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ అమ్మవారికి బోనం సమర్పించే ఆనవాయితీ కొన్ని వందల ఏళ్లుగా కొనసాగుతుందన్నారు. గోల్కోండ అమ్మవారితో మొదలై లాల్ దర్వజా అమ్మవారికి బోనం సమర్పించడంతో ముగుస్తుందని, ఇందులో భాగంగా తాను ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించడం జరిగిందన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram