కొత్త రైతు చ‌ట్టాలు రైతుల నెత్తిమీద పిడుగులు

విధాత‌: కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలు ఉరుములు లేని పిడుగుల లాంటివని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రైతాంగాన్ని కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రైతన్న సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించి నటించిన ఆర్‌.నారాయణమూర్తి గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్‌రెడ్డితో భేటీ అయ్యారు. రైతన్న సినిమాను థియేటర్‌కు వెళ్లి చూడడంపై మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు చట్టాలతో […]

  • Publish Date - August 20, 2021 / 10:35 AM IST

విధాత‌: కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలు ఉరుములు లేని పిడుగుల లాంటివని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రైతాంగాన్ని కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రైతన్న సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించి నటించిన ఆర్‌.నారాయణమూర్తి గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్‌రెడ్డితో భేటీ అయ్యారు. రైతన్న సినిమాను థియేటర్‌కు వెళ్లి చూడడంపై మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు చట్టాలతో పాటు విద్యుత్‌ చట్టంలో సవరణలను ఉటంకిస్తూ కళ్లకు కట్టినట్లుగా రైతన్న సినిమా ఉందని అన్నారు. అనంతరం ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ చట్టాలు రైతుల పాలిట శాపాలుగా మారబోతున్నాయన్నారు. విద్యుత్‌ సవరణ చట్టం కూడా కార్పొరేట్‌ వ్యవస్థకు ల‌బ్ది చేకూర్చేందుకేనన్నారు. సవరణ అంటూ జరిగితే ఉచిత విద్యుత్‌కు మంగళం పాడినట్లేనని ఆయన చెప్పారు.