త్వరలోనే రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారు: ఎంపీ మల్లు రవి జోస్యం
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంతర్గత విబేధాలతో ఎప్పుడైన కూలిపోవచ్చని, త్వరలో దేశానికి రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే అవకాశముందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మల్లు రవి జోస్యం చెప్పారు

విధాత, హైదరాబాద్ : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంతర్గత విబేధాలతో ఎప్పుడైన కూలిపోవచ్చని, త్వరలో దేశానికి రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే అవకాశముందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మల్లు రవి జోస్యం చెప్పారు. గురువారం రాహుల్‌గాందీ జన్మదినం సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మనుగడపై కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు, నితీశ్ మీద ఆధారపడి ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోందన్నారు. వాళ్లిద్దరిలో ఎవరు దూరమైనా ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని, మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై మోదీ ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. తొందరలోనే ఎన్డీయే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయేలోని చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని మల్లు రవి తెలిపారు.