Ramoji | ముందే స్మారకం.. మరణానికి అక్షర సిపాయి రామోజీ సన్నద్ధం

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తను జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకోవడం ఆయన మరణాంతరం చర్చనీయాంశమైంది

  • By: Somu |    telangana |    Published on : Jun 08, 2024 2:33 PM IST
Ramoji | ముందే స్మారకం.. మరణానికి అక్షర సిపాయి రామోజీ సన్నద్ధం

విధాత, హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తను జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకోవడం ఆయన మరణాంతరం చర్చనీయాంశమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన స్మారక నిర్మాణ మందిరం ఉంది. జీవించి ఉండగానే స్మారక కట్టడాన్ని నిర్మించుకోవడం ద్వారా నాకు చావంటే భయం లేదని.. మరణం ఒక వరమని చాటారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రామోజీ వారసత్వం కొనసాగుతుందని, ఆయన చేసిన సేవలను భారతదేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటు నెటిజన్లు శ్లాఘిస్తూ ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.