Ramoji Rao | అధికారిక లాంఛనాలతో రామోజీ రావు అంత్యక్రియలు..! సీఎస్‌కు సీఎం రేవంత్ ఆదేశాలు
Ramoji Rao | ఈనాడు అధినేత రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
Ramoji Rao | ఈనాడు అధినేత రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి.
రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఈ నెల 5వ తేదీన శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆయనను నానక్‌రాంగూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. రామోజీ పార్థివదేహాన్ని ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram