విధాత: బండి సంజయ్ కేంద్రమంత్రి అయి ఉండి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని ఆయనను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్‌ను జైల్లో వేయాలని రేవంత్ రెడ్డికి చెప్పడం ఏమిటని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. కేటీఆర్ ఏం తప్పు చేశారని జైల్లో పెడతారని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. కేటీఆర్ ఏం తప్పు చేశారని జైల్లో పెడతారని అన్నారు. కేటీఆర్‌ను జైల్లో వేయకపోతే యుద్ధం చేస్తానని బండి సంజయ్ అంటున్నారు. జైల్లో వేసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకుంటారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి మసీదులు తవ్వుతానని అన్నారు. ఇప్పుడు జైశ్రీరామ్ పేరుతో కేంద్ర మంత్రి అయ్యారు శ్రీధర్ రెడ్డి విమర్శించారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి తీసుకుని తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు.
Raoula Sridhar Reddy | బండి సంజయ్‌ని మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి: రావుల శ్రీధర్ రెడ్డి
బండి సంజయ్ కేంద్రమంత్రి అయి ఉండి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని ఆయనను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు.

Latest News
ఫుల్ ఫన్ హామీ ఇస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’..
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి .. ‘
సంక్రాంతి తర్వాత ఈ నాలుగు రాశులకు రాజయోగం..! పట్టిందల్లా బంగారమే..!!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
బాక్సాఫీసుపై 'శంకర వరప్రసాద్‌గారి' మెరుపుదాడి
ఈ బొమ్మలు..ఆదివాసీ సంస్కృతి, వారసత్వ ప్రతీకలూ
అమ్మల జాతరలో ఆదివాసీ బిడ్డ జ్ఞాపకం..కొత్త రంగులు అద్దుకున్న అమర స్థూపం
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ: రవితేజ కామెడీ పండిందా?
మేడారానికి ప్రత్యేక ఆకర్షణ ఈ బొమ్మలు
మేడారం జాతరకు మూడు కోట్ల మంది వస్తారని అధికారుల ప్రాథమిక అంచనా