ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి

ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి
  • హాజరైన సోనియా సహా ప్రముఖులు

విధాత : తెలంగాణ నూతన సీఎంగా ఎనుముల రేవంత్‌రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానుల హర్షద్వానాల మధ్య రేవంత్‌రెడ్డి సీఎంగా పదవి ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్‌తో పాటు 11మంది మంత్రులు కూడా ప్రమాణాస్వీకారం చేశారు. వారితో గవర్నర్ తమిళి సై పదవి ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సహా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు సిద్ధరామయ్య, సుఖ్విందర్‌లు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌, ఏఐసీసీ నాయకులు, పలు రాష్ట్రాల కాంగ్రెస్ ప్రముఖులు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.

మంత్రులలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ధనసరి అనసూయ(సీతక్క), తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు.

వీరిలో రేవంత్‌రెడ్డి గతంలో మంత్రిగా పనిచేయకుండానే నేరుగా ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేశారు. గతంలో చీప్‌విప్‌గా పనిచేసిన భట్టి కూడా తొలిసారి తొలిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌, సీతక్కలు కూడా తొలిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం.