సజ్జనార్‌ సార్‌ ఆ కోడి నాదే..వేలం ఆపండి

కరీంనగర్‌(2) ఆర్టీసీ డిపో అధికారులు శుక్రవారం వేలం వేయాలనుకున్న పందెం కోడి అసలు ఓనర్‌ ఎవరో తెలిసిపోయాడు. ఆ కోడి నాదేనని, దయచేసి దాని వేలం పాటను

సజ్జనార్‌ సార్‌ ఆ కోడి నాదే..వేలం ఆపండి

విధాత : కరీంనగర్‌(2) ఆర్టీసీ డిపో అధికారులు శుక్రవారం వేలం వేయాలనుకున్న పందెం కోడి అసలు ఓనర్‌ ఎవరో తెలిసిపోయాడు. ఆ కోడి నాదేనని, దయచేసి దాని వేలం పాటను ఆపివేసి నా కోడి నాకు ఇప్పించాలని ఆర్టీసీ ఎండి సజ్జనార్‌కు సంజయ్‌ అనే వ్యక్తి విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. నెల్లూరు జిల్లా కావాలికి చెందిన తన పేరు మహేశ్‌ అని, తాను తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మేస్త్రీగా పనిచేస్తున్నానని తన వివరాలు వెల్లడించాడు. సిరిసిల్లా జిల్లా రుద్రంగి నుంచి సోమవారం రోజు సంక్రాంతికి ఆంధ్రకు పోతూ నిద్ర మత్తులో నా కోడిని కరీంనగర్‌ బస్‌ స్టేషన్‌లో మరిచిపోయానని అక్కడ బస్సు దిగిన తాను మళ్లీ బస్సు కోసం చూడగా అప్పటికే బస్సు వెళ్లిపోయిందని సంజయ్‌ తెలిపాడు. కోడి వేలం విషయం యూట్యూబ్‌లలో చూసి నా కోడి సమాచారం తెలుసుకున్నానన్నారు. సజ్జనార్‌ సార్‌…నా కోడి వేలం ఆపండి.. ఆ కోడి నాదేనని…ఆధారాలుగా నా బస్‌ టికెట్‌…నా కోడి వీడియోలు..ఫోటోలు ఉన్నాయని వివరించాడు. సజ్జనార్‌ సార్‌ మీ మీద మాకు నమ్మకం ఉందని, దయచేసి నాకోడి ఎవరికి ఇవ్వకుండా వేలం పాట ఆపించి నా కోడి నాకు ఇప్పించాలని వీడియో ద్వారా అభ్యర్థించాడు.