Pocso Case | విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడి వేధింపులు.. పది మందిపై ఫోక్సో కేసు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్‌పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో పోలీసులు ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.

మరో ఫోక్సో కేసులో 20ఏళ్ల జైలుశిక్ష విధించిన మేడ్చల్ కోర్టు
విధాత, హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్‌పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో పోలీసులు ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. హెచ్‌ఎం నరేందర్ పాఠశాలలో బాధిత విద్యార్థినితో పాటు మరో నలుగురిపై హెచ్‌ఎం వేధింపులకు పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు నిలదీయడం, బాలల సంక్షేమ కమిటీ జోక్యంతో పోలీసులు హెచ్‌ఎంపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనను తొక్కిపెట్టడానికి ప్రయత్నించి మరో తొమ్మిది మందిపై కూడా ఫోక్సో కేసు నమోదు చేశారు. మరోవైపు 2017లో 8ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై నమోదైన ఫోక్సో కేసు విచారణలో మేడ్చల్ కేసు నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 లక్షల జరిమానాను విధిస్తూ జడ్జి సంచలన తీర్పును వెలువరించింది.