Special Trains | తొలి ఏకాదశి పండుగ.. పండరీపురానికి ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మహారాష్ట్రలోని పండరీపురం విఠలేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది.
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మహారాష్ట్రలోని పండరీపురం విఠలేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. నాగర్‌కోయిల్ – పండరీపురం (07515) రైలు ఈ నెల రాత్రి 7 గంటలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. పండరీపురం – నాగర్ కోయిల్ (07516) రైలు 17న రాత్రి 11.55 గంటలకు బయలుదేరుతుంది పేర్కొంది. అకోలా – పండరీపుం (07505) రైలు 16న ఉదయం 11 గంటలకు బయలుదేరుతుందని చెప్పింది.
ఇక తిరుగు ప్రయాణంలో పండరీపురం – అకోలా (07506) రైలు 17న రాత్రి 9.40 ప్రయాణమవుతుంది. ఆదిలాబాద్ – పండరీపురం (07501) రైలు 16న ఉదయం 9 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు వేకువ జామున గమ్యస్థానం చేరుతుంది. తిరిగి పండరీపురం – ఆదిలాబాద్ (07504) రైలు రాత్రి 8 గంటలకు పండరీపురంలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్ చేరుతుంది. మచిలీపట్నం – నాగర్‌సోల్ (07169) రైలు ఈ నెల 15న ఉదయం 12.12 గంటలకు అందుబాటు ఉండనున్నది. ఇదిలా ఉండగా.. ఉర్సు ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ – వాడి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 20, 22 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఆయా రైళ్లను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరింది.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram