Southwest Monsoon | రాష్ట్రంలో మూడ్రోజులు వానలు.. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

  • By: TAAZ |    telangana |    Published on : Jun 10, 2025 6:26 PM IST
Southwest Monsoon | రాష్ట్రంలో మూడ్రోజులు వానలు.. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Southwest Monsoon | వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో వానలు పడతాయని వాతావరణ పేర్కొన్నది. నిజానికి తెలంగాణ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. పైగా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టోపోయారు కూడా.. ఇదెలా ఉంటే తాజాగా వాతావరణశాఖ వర్షాలకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, మెదక్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డితో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. వనపర్తి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.