Spencer Markets | హైదరాబాద్ : ముషీరాబాద్ స్పెన్సర్ మార్కెట్( Musheerabad Spencer ).. ఇది అందరికి సుపరిచితమే. ఎందుకంటే ఈ స్పెన్సర్ మార్కెట్‌లో సరుకులు, బట్టలు, ఇతర సామాగ్రితో పాటు మద్యం( Alcohol ) కూడా లభిస్తుంది. కల్తీ లేని మద్యం దొరుకుతుందనే భావన చాలా మందిలో ఉంది. అందుకే నగరంలోని చాలా మంది ముషీరాబాద్ స్పెన్సర్ మార్కెట్‌కు వచ్చి సరుకులతో పాటు మద్యం తీసుకెళ్తుంటారు.
హైదరాబాద్( Hyderabad ) నగరంలో ఇదే మొదటి స్పెన్సర్ మార్కెట్. నగరంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న స్పెన్సర్ మార్కెట్ల( Spencer Markets )ను మూసివేయగా, ముషీరాబాద్ స్పెన్సర్‌తో పాటు అక్కడక్కడ ఓపెన్ ఉన్నాయి. కానీ దీంతో పాటు మిగతావి కూడా త్వరలో మూతబడుతాయని సమాచారం. అక్టోబర్ 31వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని అన్ని స్పెన్సర్ మార్కెట్లను మూసివేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో తమ మార్కెట్లలో ఉన్న సరుకులు, ఇతర సామాగ్రిని తక్కువ ధరకే విక్రయించేందుకు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో క్లియరెన్స్ సేల్స్( Clearance Sales ) పెట్టడం జరిగింది. స్పెన్సర్ మార్కెట్లలో క్లియరెన్స్ సేల్స్ పెట్టారని తెలుసుకున్న జనం.. ఆ మార్కెట్ల వద్ద ఎగబడ్డారు. భారీ డిస్కౌంట్లు ఇస్తున్న స్పెన్సర్స్ మార్కెట్లకు జనం పోటెత్తారు.