Khammam | మాకు టీచర్లు కావాలి.. పాఠశాలకు తాళం వేసి రోడ్డెక్కిన విద్యార్థులు

మాకు టీచర్లు కావాలంటూ విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి రోడెక్కి నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు ప్రభుత్వ పాఠశాలలో 60 మంది విద్యార్థులకుగాను కేవలం నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు

Khammam | మాకు టీచర్లు కావాలి.. పాఠశాలకు తాళం వేసి రోడ్డెక్కిన విద్యార్థులు

విధాత, హైదరాబాద్: మాకు టీచర్లు కావాలంటూ విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి రోడెక్కి నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు ప్రభుత్వ పాఠశాలలో 60 మంది విద్యార్థులకుగాను కేవలం నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. దీంతో విద్యార్థులకు అన్ని సబ్జక్టులను బోధించే ఉపాధ్యాయులు కరువయ్యారు.

కాగా.. తమకు పాఠాలు చెప్పే వారు లేక మా చదువులు దెబ్బతింటున్నాయని తమకు తక్షణమే అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ స్కూలుకి తాళం వేసి రోడ్డెక్కి విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనకు వారి తల్లిదండ్రులు కూడా సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యపై స్పందించాలని వారు డిమాండ్ చేశారు.