తెలంగాణ గవర్నరుకు పీఠాధిపతుల ఆశీస్సులు
విధాత: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను కలిశారు. చందా నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయ రజతోత్సవములకు హాజరై స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ గవర్నరుకు స్వరూపానందేంద్ర స్వామి జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిమను బహూకరించారు. గవర్నరు నుదుట తిలకం దిద్ది రాజశ్యామల అమ్మవారి రక్షారేఖను కట్టారు. ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకోవడం ఎంతో […]
విధాత: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను కలిశారు. చందా నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయ రజతోత్సవములకు హాజరై స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ గవర్నరుకు స్వరూపానందేంద్ర స్వామి జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిమను బహూకరించారు. గవర్నరు నుదుట తిలకం దిద్ది రాజశ్యామల అమ్మవారి రక్షారేఖను కట్టారు.
ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మిక మార్గంలో విశాఖ శారదా పీఠాధిపతులు చేపడుతున్న కృషి అభినందనీయమని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలంతా బయటపడాలని స్వామీజీని కోరుకున్నట్లు తెలిపారు. చందానగర్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు శోభాయమానంగా ఉన్నాయని అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram