Himanshu: గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టా అందుకొని.. KCR తాత ఆశీర్వాదం తీసుకుని

విధాత‌: ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌నుమ‌డు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్షురావు.. 12వ త‌ర‌గ‌తి గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టా అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా తాత కేసీఆర్, నాన‌మ్మ శోభ ఆశీర్వాదం తీసుకున్నారు హిమాన్షు. గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టా అందుకున్న హిమాన్షును కేసీఆర్ దంప‌తులు, కేటీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శైలిమ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హిమాన్షును సీఎం ఆశీర్వ‌దించారు. గచ్చిబౌలిలోని వోక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మంగ‌ళ‌వారం 12వ త‌ర‌గ‌తి గ్రాడ్యుయేష‌న్ డే వేడుక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా […]

Himanshu: గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టా అందుకొని.. KCR తాత ఆశీర్వాదం తీసుకుని

విధాత‌: ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌నుమ‌డు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్షురావు.. 12వ త‌ర‌గ‌తి గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టా అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా తాత కేసీఆర్, నాన‌మ్మ శోభ ఆశీర్వాదం తీసుకున్నారు హిమాన్షు.

గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టా అందుకున్న హిమాన్షును కేసీఆర్ దంప‌తులు, కేటీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శైలిమ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హిమాన్షును సీఎం ఆశీర్వ‌దించారు.

గచ్చిబౌలిలోని వోక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మంగ‌ళ‌వారం 12వ త‌ర‌గ‌తి గ్రాడ్యుయేష‌న్ డే వేడుక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా 12వ త‌ర‌గ‌తి పూర్తి చేసుకున్న హిమాన్షు రావు గ్రాడ్యుయేష‌న్ డే వేడుక‌ల్లో గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టా పుచ్చుకున్నారు.

క్రీడ‌లు, సాంస్కృతిక‌రంగం, సామాజిక సేవ త‌దిత‌ర రంగాల్లో అత్యంత ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన విద్యార్థినీ విద్యార్థుల‌కు స్కూల్ యాజమాన్యం ప్ర‌తిభాపుర‌స్కారాల‌ను అంద‌జేసింది.

హిమాన్షు రావు ‘కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్’ (సీఏఎస్‌) విభాగంలో గొప్ప ప్రతిభను ప్రదర్శించినందుకు గాను ప్రతిభను గుర్తించి, హిమాన్షుకు సీఏఎస్‌ విభాగంలో ఎక్స‌లెన్స్‌ అవార్డును అందజేశారు.

గ్రాడ్యుయేషన్ డే సంద్భంగా పట్టాలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సమావేశ మందిరం కిక్కిరిసింది. విద్యార్థుల హర్షధ్వానాలతో ప్రాంగణం మార్మోగిపోయింది.