Telangana Gram Panchayat Elections : తెలంగాణలో ముగిసిన ఆఖరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 3,752 సర్పంచ్ స్థానాలకు ఓటింగ్ జరగగా, కొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Telangana Gram Panchayat Elections : తెలంగాణలో ముగిసిన ఆఖరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో మూడో(ఆఖరి) విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 182మండలాల్లోని 3,752పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 28,410వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. మూడో విడతలో 4,157పంచాయతీలకు గాను 394ఏకగ్రీవం కాగా, వార్డులు 7,916ఏకగ్రీవం అయ్యాయి. ఆఖరివిడతలో 53, 06,401మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు కొనసాగింది. క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. చాల గ్రామాల్లో ఉదయం 11గంటలకే 60శాతంకు పైగా పోలింగ్ నమోదైంది. అధికారికంగా పోలింగ్ శాతం వెల్లడి కావాల్సి ఉంది.

రాష్ట్రంలో మొత్తం 12 వేల 728 గ్రామ పంచాయతీలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 11న మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. మొదటి విడతలో 4,230పంచాయతీలకు ఎన్నికలకు పోలింగ్ జరిగింది. వాటిలో కాంగ్రెస్ పార్టీ 2,425సర్పంచ్ స్ధానాలను గెలుచుకోగా..బీఆర్ఎస్ 1168, బీజేపీ 189, ఈతరులు 464సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు.

డిసెంబర్ 14న రెండో దశ పోలింగ్ జరిగిన 4,333సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2,331, బీఆర్ఎస్ 1,195, బీజేపీ 257, ఇతరులు 578స్థానాల్లో విజయం సాధించారు.

డిసెంబర్ 17న మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిపోగా..ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికాసేపట్లో మొదలుకానుంది. మూడు విడతల్లో గెలిచిన నూతన సర్పంచ్ లు, వార్డు సభ్యులు ఈనెల 22న పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి :

Google Maps Wrong Navigation : గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని కృష్ణా నదిలోకి లారీ!
Bigg Boss 9 | నాలుగు రోజుల్లో ముగియ‌నున్న సీజ‌న్ 9 .. ఫ్యామిలీ వీడియోతో ఎమోషనల్‌ అయిన కంటెస్టెంట్లు