విధాత : తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం తీసుకొచ్చింది. ఎరుకుల సామాజికవర్గం అభివృద్ధి కోసం 60కోట్ల నిధులతో ఎరుకల సాధికారత పథకాన్ని తెచ్చింది. ఈ పథకాన్ని ట్రైకార్ సంస్థ ద్వారా అమలు చేస్తూ పందుల పెంపకం సొసైటీలకు ఆర్ధిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పథకం అమలు కోసం ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సారధ్యంలో కమిటీని ఏర్పాటు చేసింది.
యూనిట్‌కు గరిష్టంగా 30లక్షల వరకు సహాయం అందించి అందులో 50శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఇందులో 40శాతం బ్యాంకు రుణం, 10శాతం లబ్ధిదారుల భాగస్వామ్యం ఉండనుంది. పందుల పెంపకం, స్టాటర్ హౌజ్, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు, రవాణా, పోర్క్ రిటైల్ మార్కెట్ల ఏర్పాటు కోసం ఈ పథకం ద్వారా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ లబ్ధిదారులను ఎంపికి చేయనుంది.