Gram Panchayat Elections : గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. సోషల్, ఎకనామిక్ సర్వే ఆధారంగా వార్డు, సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు మార్చబడనున్నాయి.

Gram Panchayat Elections : గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల

విధాత, హైదరాబాద్ : గ్రామపంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గ్రామ పంచాయతీ వార్డు స్థానాలకు 2024సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలని, సర్పంచ్ స్థానాలకు 2011సెన్సస్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, 2024సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని జీవోలో ఆదేశించింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫారసు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే పంచాయతీ రాజ్ శాఖ నుంచి గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన గైడ్ లైన్స్ తో కూడిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. రోటేషన్ల విధానంలో రిజర్వేషన్లు అమలు కానుండటంతో గతంలో ఉన్న రిజర్వేషన్లు మారబోతున్నాయి. వార్డు స్థానాల రిజర్వేషన్లను ఎంపీడీవోలు, సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను ఆర్డీవోలు ఖరారు చేయాలని నిర్ధేశించింది.

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 24న హైకోర్టులో కేసు విచారణ రానుంది. 25న రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఆ తర్వతా ఈనెల 26 లేదా 27లలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. గ్రామపంచాయతీల వారిగా తుది ఓటర్ల జాబితాను ఆదివారం ప్రకటించబోతున్నారు. రాష్ట్రంలోని 31జిల్లాల్లోని 565మండలాల్లోని 12,733గ్రామ పంచాయతీలకు, 1,12,288వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. మూడు విడుతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాతా ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలు జరుగున్నాయి.