• Telugu News
  • /Telangana

IAS Transfers | తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా దానకిశోర్‌

IAS Transfers | రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. మొత్తం మూడు వేర్వేరు జీవోల ద్వారా పలువురు కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులను ట్రాన్స్‌ఫర్ చేసింది.

Reported by: Chandram | తెలంగాణ‌ | Apr 25, 2026, 11:43 pm IST
Read Time: 5 mins
IAS Transfers | తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా దానకిశోర్‌

IAS Transfers | రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. మొత్తం మూడు వేర్వేరు జీవోల ద్వారా పలువురు కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులను ట్రాన్స్‌ఫర్ చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సంజయ్‌ను న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రత్యేక అధికారిగా నియమించింది. ఇక ఇప్పటివరకు ఆయన చూసిన శాఖల నిర్వహణను ఎం.దానకిశోర్‌కు అప్పగించింది. అలాగే గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కొనసాగతాయని తెలిపింది.

బదిలీల వివరాలు

సంజయ్ కుమార్ – తెలంగాణ భవన్ ప్రత్యేక అధికారి

దానకిశోర్ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

బి.విజయేంద్ర – ఎస్‌సీడీ శాఖ ప్రభుత్వ కార్యదర్శి

హరిచందన దాసరి – కార్మిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి

కృష్ణ ఆదిత్య – పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి

జెండాగే హనుమంత్ కొండిబా – ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌ సీఈవో

పి. ప్రవీణ్య – ఆర్అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి

సంతోష్ బి.ఎం. గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి

అనుదీప్ దురిశెట్టి – ఐటీఈ&సీ శాఖ జాయింట్ సెక్రటరీ

అభిలాష అభినవ్ – ఇంటర్ బోర్డు కార్యదర్శి

జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ – పౌరసరఫరాల శాఖ డైరెక్టర్

జి. ముకుంద రెడ్డి – ఐఅండ్‌పీఆర్ ప్రత్యేక కమిషనర్

అపూర్వ్ చౌహాన్ – సీఎంఆర్‌వో ప్రాజెక్టు డైరెక్టర్

కలెక్టర్ల బదిలీ వివరాలు

భావేశ్ మిశ్రా – నిర్మల్ కలెక్టర్

ప్రియాంక అలా – హైదరాబాద్ కలెక్టర్

ప్రతీక్ జైన్ – సంగారెడ్డి కలెక్టర్

దివాకర టీఎస్- ఖమ్మం కలెక్టర్

భోర్కడే హేమంత్ సహదేవరావు – ములుగు కలెక్టర్

చెక్క ప్రియాంక – నారాయణపేట కలెక్టర్

హేమంత కేశవ్ పాటిల్ – నాగర్‌కర్నూల్ కలెక్టర్

మంద మకరందు – ఉట్నూర్ ఐటీడీఏ పీవో

లెనిన్ వత్సల్ టొప్పో – ఏటూరునాగారం ఐటీడీఏ పీవో

కిరణ్మయి కొప్పిశెట్టి – రంగారెడ్డి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)

యువరాజ్ మర్మత్కుమ్రంభీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)

జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ల బదిలీ వివరాలు

పి. ఉదయ్ కుమార్ – జీహెచ్‌ఎంసీ గోల్కొండ జోనల్ కమిషనర్

బడావత్ సంతోష్ – జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్

నారాయణ అమిత్ – జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్

వికాస్ మహతో – జీహెచ్‌ఎంసీ ఎల్‌బీ నగర్ జోనల్ కమిషనర్

మయాంక్ సింగ్ – జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్

ఎస్‌.శ్రీనివాస్ రెడ్డి – జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్

Read More:

తెలంగాణ రోడ్లపై నెత్తుటేర్లు.. రోజుకు 20 మరణాలు

తెలంగాణలో తిరిగి ‘టీఆర్ఎస్’ ప్రయోగం.. కవిత ప్రయత్నం ఫలిస్తుందా! వికటిస్తుందా?