రేపు ఇంటర్.. 30న పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా సోమవారం ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫస్టియర్, సెకండియర్ కలిసి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10న మూల్యాంకన చేపట్టగా, ఏప్రిల్ 10వ తేదీన ముగిసింది. మూల్యాంకనం పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. గతేడాది మే 9న ఇంటర్ ఫలితాలు ప్రకటించగా, ఈ ఏడాది 15 రోజుల ముందే ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల కోసం www.tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
30న పది ఫలితాలు విడుదల
తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఈ నెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. పదో తరగతి పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. 5,08,385 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు. ఈ ప్రశ్నపత్రాల మూల్యాంకన శనివారం పూర్తయింది. ప్రస్తుతం డీకోడింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram