12న తెలంగాణ జన సమితి 4వ రాష్ట్ర ప్లీనరీ

తెలంగాణ జన సమితి పార్టీ 4వ రాష్ట్ర ప్లీనరీ ఈ నెల 12న హైదరాబాద్ లోని జలవిహార్ లో నిర్వహించనున్నట్లుగా పార్టీ రాష్ట్ర కమిటీ వెల్లడించింది. టీజేఎస్ తన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునేందుకు నిర్వహిస్తున్న ఈ ప్లీనరీకి పార్టీ ప్రతినిధులు హాజరుకావాలని పార్టీ రాష్ట్ర కమిటీ తెలిపింది.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ జన సమితి పార్టీ 4వ రాష్ట్ర ప్లీనరీ ఈ నెల 12న హైదరాబాద్ లోని జలవిహార్ లో నిర్వహించనున్నట్లుగా పార్టీ రాష్ట్ర కమిటీ వెల్లడించింది. బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా..అప్రజాస్వామిక, నిరంకుశంగా వ్యవహరిస్తూ సీమాంధ్ర విధానాలను అనుసరిస్తూ..తెలంగాణ వనరులను సీమాంధ్ర కాంట్రాక్టర్లకు దోచుపెట్టడాన్ని ప్రశ్నిస్తూ టీజేఎస్ ఆవిర్భవించిందని తెలపిపింది. తెలంగాణలో మారాల్సింది పాలకులు కాదు..రాజకీయ విధానాలు అని గ్రహించి సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో టీజేఎస్ 2018ఏప్రిల్ 29న ఏర్పడిందని పేర్కొంది.

గడిచిన ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రజా గొంతుకగా నిలబడిందని, నేటి ఎన్నికల రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొంటూ..ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా ఐక్య ఉద్యమాలను నిర్మిస్తూ వచ్చిందని తెలిపింది. రాజకీయాలలో మార్పే లక్ష్యంగా విలువలు కల్గిన రాజకీయాలే భవిష్యత్తును నిర్మిస్తాయన్న నమ్మకంతో టీజేఎస్ పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలో టీజేఎస్ తన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునేందుకు ఈ నెల 12న హైదరాబాద్ జల విహార్ లో పార్టీ 4వ ప్లీనరీ నిర్వహించుకుంటుందని, ఈ సమావేశాలకు పార్టీ ప్రతినిధులు హాజరుకావాలని పార్టీ రాష్ట్ర కమిటీ తెలిపింది.

Latest News