TG | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ : రాష్ట్రాల సీఎంలకు ప్రత్యేక ఆహ్వానం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ (Telangana Rising Global Summit-2025) సమ్మిట్ నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సబ్మిట్ కు అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విధాత, హైదరాబాద్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ (Telangana Rising Global Summit-2025) సమ్మిట్ నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సబ్మిట్ కు అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. స్వయంగా తెలంగాణ మంత్రులు వెళ్లి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా కలిసి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానిస్తారు. ఈ నెల 4 వ తేదీన మంత్రులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన లేఖలు అందిస్తారు. ఎవరెవరు ఏ ఏ రాష్ట్రాలకు వెళ్లాలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రత్యేక వేదికను ఫ్యూచర్ సిటీలో రూపొందిస్తున్నారు. సమ్మిట్ లో కీలక ఒప్పందాలు చేసుకోవాడానికి రాష్ట్రప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు ఆహ్వానించింది. ఈ సదస్సుకు హాజరు కావాల్సిందిగా మూడు వేల మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపించింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి ఆహ్వానించనున్నారు.
అలాగే, రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించే మంత్రుల వివరాలు..
- జమ్మూ కాశ్మీర్, గుజరాత్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
- పంజాబ్, హర్యానా – దామోదర్ రాజనర్సింహ
- ఆంధ్రప్రదేశ్ – కోమటి రెడ్డి వెంకటరెడ్డి
- కర్ణాటక, తమిళనాడు – దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- ఉత్తరప్రదేశ్ – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- రాజస్థాన్ – పొన్నం ప్రభాకర్
- చత్తీస్ గడ్ – కొండ సురేఖ
- వెస్ట్ బెంగాల్ – సీతక్క
- మధ్యప్రదేశ్ – తుమ్మల నాగేశ్వరరావు
- అస్సాం – జూపల్లి కృష్ణా రావు
- బీహార్ – వివేక్ వెంకటస్వామి
- ఒడిస్సా – వాకిటి శ్రీహరి
- హిమాచల్ ప్రదేశ్ – అడ్లూరు లక్ష్మణ్ కుమార్
- మొహమ్మద్ అజారుద్దీన్ – మహారాష్ట్ర
- ఢిల్లీ సీఎం, కేంద్ర మంత్రులు, గవర్నర్లకు రాష్ట్ర ఎంపీ లు ఆహ్వానం అందిస్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram