రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణలో రహదారుల అభివృద్దికి భారీగా నిధులు వెచ్చిస్తున్నామని రాష్ట్ర ఆర్ ఆండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. నెహ్రూ రింగ్ రోడ్డుకు 30కిలో మీటర్ల వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్టు తెలిపారు. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటవుతున్నాయిని వివరించారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో రహదారుల అభివృద్దికి భారీగా నిధులు వెచ్చిస్తున్నామని రాష్ట్ర ఆర్ ఆండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. నెహ్రూ రింగ్ రోడ్డుకు 30కిలో మీటర్ల వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్టు తెలిపారు. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటవుతున్నాయిని వివరించారు. న్యూయార్స్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పీకో టెక్నాలజి (PICO Technology) సంస్థప్రతినిధులతో శనివారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, వెంకట్ రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వెంకట్ రెడ్డి రాష్ట్రంలో రహదారుల విస్తరణ, అభివృద్ధి అంశాలను వారికి వివరించారు.
రింగ్ రోడ్ల పక్కన రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి రవాణా సదుపాయాలను ప్రపంచంలోని పెద్ద నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. హయత్ నగర్- ఎల్బీనగర్ ల మధ్య డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మిస్తున్నాట్టు వివరించారు. కింది రోడ్డు స్థానిక ట్రాఫిక్ అవసరాలకు వినియోగిస్తామని, పైన ఉండే రెండు అంతస్థుల రోడ్లు నగరం నుంచి వెలుపలకు, లోపలకి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకిస్తామని చెప్పారు. నాగపూర్ తర్వాత డబుల్ డెక్కరో రోడ్లు నిర్మిస్తున్న నగరం ఇదేనని అన్నారు. రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సీఆర్‌ఎంపీ ఫేజ్ 2 కింద రూ. 3,145 కోట్లతో 1,045 కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లుగా తెలిపారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం పురోగతిని వివరించారు.
సమావేశంలో పికో టెక్నాలజి వ్యవస్థాపక సిఇఓ జారొడ్ యుస్టర్ (Jarrod Yuster), పికో ఇండియా సిఇఓ హరి కోదండరామన్, డైరెక్టర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram