Suryapeta: జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ రోల్ మోడల్: మంత్రి జగదీష్‌రెడ్డి

విధాత: దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల(journalist)కు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ(Telangana) అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Jagadeesh Reddy) అన్నారు. జర్నలిస్ట్ ల సంక్షేమం విషయంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ(Telangana Press Academy)ఆధ్వర్యంలో సూర్యాపేట(suryapeta) జిల్లా జర్నలిస్టుల కోసం నిర్వహించిన శిక్షణా తరగతుల ముంగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరై మాట్లాడారు. సమగ్రమైన సమాచారంతో, వాస్తవికతతో […]

Suryapeta: జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ రోల్ మోడల్: మంత్రి జగదీష్‌రెడ్డి

విధాత: దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల(journalist)కు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ(Telangana) అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Jagadeesh Reddy) అన్నారు. జర్నలిస్ట్ ల సంక్షేమం విషయంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ(Telangana Press Academy)ఆధ్వర్యంలో సూర్యాపేట(suryapeta) జిల్లా జర్నలిస్టుల కోసం నిర్వహించిన శిక్షణా తరగతుల ముంగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరై మాట్లాడారు.

సమగ్రమైన సమాచారంతో, వాస్తవికతతో కూడిన వార్తలకు ఆదరణ, గుర్తింపు లభిస్తుందన్నారు.
జర్నలిజం ఉద్యోగం కాదు సామాజిక బాధ్యత అన్న మంత్రి, వృత్తికి సామాజిక బాధ్యత తోడైతే అద్భుతాలు చేయవచ్చని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 7 వేల అక్రిడియేషన్‌ కార్డులు ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 20 వేల మంది జర్నలిస్టులకు అక్రిడియేషన్‌ సౌకర్యం కల్పించామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించినందున సీఎం కేసీఆర్‌ ప్రెస్‌ అకాడమీకి 42 కోట్లు సంక్షేమ నిధులు ఇచ్చారని తెలిపారు.

90 శాతం జర్నలిస్టులు మధ్యతరగతి వారు, ఆర్థిక స్థోమత లేని వారు ఉన్నందున సీఎం దృష్టికి తీసుకెళ్లి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించటానికి కృషి చేస్తున్నామన్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని, అప్పుడే జర్నలిస్టులకు గౌరవం పెరుగుతుందని చెప్పారు. సామాజిక మార్పుకు నాంది జర్నలిస్టులు అని అన్నారు.

ప్రజలకు, ప్రభుత్వానికి మేలు కొలుపుగా వార్తలుండాలని మంత్రి కోరారు.
అనుకూల, ప్రతికూల వార్త లలో స్పష్టత అవసరం అన్న మంత్రి, తప్పు చేస్తే నన్ను కూడా వదలవద్దు అని సూచించారు. విమర్శలు కూడా స్వీకరించే పద్దతిలో వార్తలు ఉండాలని కోరారు. ఇతరుల జీవితాలను నష్టపరిచే విధంగా కాకుండా పరిశీలనాత్మకంగా వార్తలు ఉండాలని, దానికి గాను ప్రెస్ అకాడమీ నిర్వహించిన శిక్షణా తరగతులు ఎంత గానో ఉపయోగ పడుతాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

వార్తలు వార్తలు గా వచ్చే పరిస్తితి ప్రస్తుతం దేశంలో లేదన్నారు. సమాజాన్ని నాశనం చేస్తున్న వినాశక శక్తులలో చేతులలో జాతీయ మీడియా ఉందని అన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందన్నారు. జర్నలిజం చీకటి రోజుల్లో మగ్గుతుందన్నారు. మీడియాను అణచి వేస్తామనుకుంటే వారి కంటే మూర్ఖులు సమాజంలో ఎవరూ ఉండరని అన్నారు. దేశ ప్రజల జీవితాలను మార్చే శక్తి రాజకీయ పార్టీలు.. మీడియాకు ఉందన్నారు.

2014 లో ఆకలి కేకలు, అత్మహత్యలతో విల విల లాడిన తెలంగాణను అన్నపూర్ణగా మార్చింది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. మోడీ ప్రభుత్వం హయాం లో 33 శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. మోడీ పాలనలో దేశంలో దారిద్య్రం తాండవిస్తుందన్న మంత్రి, ఎగువన ఉన్న ఆర్ధిక ప్రగతి సూచీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల కంటే హీనంగా మారిందన్నారు. మోడీ వైఫల్యాన్ని ఎండగట్టడంలో ప్రతి పక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలం చెందిందన్నారు. వాస్తవాలను బయటకు తేకుండా మీడియాను చెప్పు చేతల్లో ఉంచుకున్న మోడీ, దేశ చరిత్రలో అతి బలహీన ప్రధాని అని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.

సామాజిక బాధ్యతలో సూర్యాపేట జర్నలిస్ట్ లు ఎప్పుడూ ముందుంటారని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని తాను గమనించానన్నారు.. జాతీయ కబడ్డీ పోటీల సమయంలో ప్రేక్షకుల గ్యాలరీ కూలిన సమయంలో కెమెరాలను పక్కన పడేసిన జర్నలిస్ట్ మిత్రులు క్షతగాత్రులను ఆసుపత్రి కి తరలించే సామాజిక కార్యక్రమంలో పాల్గొన్నారని, ఇంతే కాకుండా, రోడ్డు ప్రమాదాల సమయంలో కూడా ఎంతో మందిని సూర్యాపేట జర్నలిస్ట్ లు క్షతగాత్రులకు తమ సహాయ సహకారాలు అందజేయడాన్ని తాను గమనించానని మంత్రి తెలిపారు.

అనంతరం శిక్షణా తరగతుల లో పాల్గొన్న జర్నలిస్ట్ లకు సర్టిఫికెట్‌లను అందజేశారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జూలూరు గౌరీ శంకర్, బుచ్చయ్య, జర్నలిస్ట్ నాయకులు వజ్జే వీరయ్య యాదవ్, రాంబాబు గౌడ్, శ్రీనివాస్ గుప్తా, శ్యామ్ సుందర్ రెడ్డి, జానయ్య, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.